‘ఛమకు ఛమకు ఛాం’ భలే వుందే..


సాయిధరమ్‌ తేజ్‌ లేటెస్ట్ చిత్రం ‘ఇంటిలిజెంట్‌’. వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. లావణ్య త్రిపాఠి కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. తాజాగా సినిమాకు సంబంధించిన మేకింగ్‌ వీడియోను విడుదల చేశారు.

‘కొండవీటి దొంగ’ చిత్రంలో చిరంజీవి ఆడిపాడిన ‘ఛమకు ఛమకు ఛాం’ పాటను ఇందులో రీమిక్స్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటను బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తూ రూపొందించిన మేకింగ్‌ వీడియో అలరిస్తోంది. సీకే ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సి.కల్యాణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.