చైతూ – నితిన్ ఢీ

nithin chaituఒకే రోజు ఇద్దరు యూత్ స్టార్స్ త‌ల‌ప‌డుతున్నారు. ఒక‌రు నాగ‌చైత‌న్య‌, ఇంకొక‌రు నితిన్‌! చైతూ న‌టించిన ఆటోన‌గ‌ర్ సూర్య‌, నితిన్ – పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న హార్ట్ ఎటాక్ రెండూ జ‌న‌వ‌రి 31నే రాబోతున్నాయి. నిజానికి ఇవి సంక్రాంతి సినిమాలు. కానీ ముగ్గుల పండ‌క్కి పోటీ కాస్త ఎక్కువ‌గా ఉండ‌డంతో సంక్రాంతి బ‌రి నుంచి త‌ప్పుకొని… కాస్త లేటుగా వ‌స్తున్నారు. ఆటోన‌గ‌ర్ సూర్యపై నిన్నా మొన్నటి వ‌ర‌కూ ఎవరికీ అట్టే అంచ‌నాల్లేవు. కానీ ట్రైల‌ర్ ఎప్పుడైతే బ‌య‌ట‌కు వ‌చ్చిందో, అప్పటి నుంచీ ఈ సినిమాపై అంద‌రి దృష్టీ ప‌డింది. ఇక పూరి ఎప్పుడు ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చెప్పలేం. పైగా నితిన్ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. కాబ‌ట్టి జ‌న‌వ‌రి 31న పోటీ తీవ్రంగానే ఉన్నట్టు క‌నిపిస్తోంది. మ‌రి ఎవ‌రు పై చేయి సాధిస్తారో చూడాలి.