Site icon TeluguMirchi.com

చైతు సినిమా అందుకే లేటు

మారుతి- నాగచైతన్య కలయికలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి ‘శైలజారెడ్డి’ అల్లుడు అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సినిమాను నిర్మిస్తున్నారు. నాగ చైతన్య సరసన అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికగా నటిస్తోంది.

కాగా ఈ సినిమా ప్రకటన ఎప్పుడో వచ్చినప్పటికీ ఇంకా షూటింగ్ స్టార్ట్ కాలేదు. ‘‘అందరూ చైతు సినిమా గురించి అడుగుతున్నారు. ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తి చేశాం. కానీ, ఆయన ‘సవ్యసాచి’లో బిజీగా ఉన్నారు. నేనూ మీలాగే వేచి చూస్తున్నా. మే నెలలో ఫస్ట్‌లుక్‌ ఇచ్చేందుకు ప్రయత్నిస్తా. దయ చేసి వేచి ఉండండి. మీకు ఎలా కావాలో అలానే ఉంటుంది సినిమా’’ అని మారుతి చెప్పుకొచ్చారు . ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Exit mobile version