Site icon TeluguMirchi.com

చైతు – సాయి పల్లవి మూవీ స్టార్ట్

ఫిదా చిత్రం తో 2017 లో సూపర్ హిట్ అందుకున్న శేఖర్ కమ్ముల..తాజాగా మరో చిత్రానికి కొబ్బరి కాయ కొట్టారు. ఈ చిత్ర పూజ కార్యక్రమాలు సికింద్రాబాద్ వినాయకుడి ఆలయంలో జరిగాయి. ఈ సినిమాలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. ఫిదా తర్వాత సాయి పల్లవి..శేఖర్ డైరెక్షన్లో నటిస్తుండడం..మజిలీ తో మళ్లీ ట్రాక్ లోకి వచ్చిన చైతు ఈ సినిమాలో హీరో కావడం తో ఈ సినిమా ఫై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది.

ఈ చిత్రంతో ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నిర్మాణ రంగంలో అడుగుపెడుతుంది. డిస్ట్రిబ్యూటర్స్ గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను విడుదల చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్..మొదటిసారి నిర్మాణ రంగంలోకి రావడం పట్ల అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ప్రారంభం అయిన ఈ సినిమా ఈ ఏడాది చివర్లో ఆడియన్స్ ముందుకు రానుంది. సెప్టెంబర్ మొదటి వారంలో రెగ్యులర్‌ షూటింగ్ ప్రారంభం కానుంది. మరి ఈ సినిమా కు సంబందించిన మిగతా కాస్ట్ & క్రూ వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version