చైతూ నాగ్‌ కి ఝ‌ల‌క్ ఇస్తాడా?

Tadakhaఫ్లాప్ టాక్ వ‌చ్చినా స‌రే… కాస్తో కూస్తో వసూళ్లు తెచ్చుకొని… తెరిపిన ప‌డ్డాడు గ్రీకువీరుడు. సినిమాలేమీ లేక‌పోవ‌డంతో, ఫ్యామిలీ ఆడియ‌న్స్ అంతా గ్రీకు వీరుడు బాట ప‌ట్టారు. రెండ్రోజులుగా ఫ్యామిలీ ఆడియ‌న్స్ తాకిడి ఎక్కువైంది. హ‌మ్మయ్య‌… అని ఊపిరి పీల్చుకొంటున్న నాగ్‌ కి.. త‌న‌యుడు నాగ‌చైత‌న్య ఝ‌ల‌క్ ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే ‘త‌డాఖా’ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకి ముందు నుంచే పాజిటివ్ టాక్ ఉంది. సినిమా బాగుంద‌నే.. టాక్ బాగా వ్యాపించింది. సునీల్, త‌మ‌న్నాలు ఉండ‌నే ఉన్నారు. దాంతో ‘త‌డాఖా’ ఓపెనింగ్స్ భారీ స్థాయిలో ఉండ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. త‌డాఖా వ‌స్తే.. ఈ మాత్రం నెట్టుకొస్తున్న గ్రీకువీరుడు మ‌ళ్లీ ఈగ‌లు తోలుకోవ‌డం గ్యారెంటీ. దాంతో ఇప్పుడు నాగ్‌.. సంక‌ట స్థితిలో ప‌డ్డారు. ఓ వారం ఆల‌స్యంగా వ‌స్తే బాగుండును.. నా సినిమా గ‌ట్టెక్కేసేది అనుకొంటున్నార‌ట‌. పాపం అటు కొడుకు సినిమాకి వసూళ్లు బాగుంటాయ‌ని ఆనందించాలో, త‌న సినిమాకి గండి ప‌డుతుంద‌ని బాధ ప‌డాలో అర్థం కావ‌డం లేదాయ‌న‌కు.