2 రోజులు.. 4 కోట్లు ఇదీ చైతూ త‌డాఖా!

thadakaత‌డాఖా సినిమా మెల్లిగా హిట్ ట్రాక్ ఎక్కేస్తోంది. చైత‌న్య‌, సునీల్ జోడీ మాస్ ప‌ట్టేశారు. త‌మన్నా అందాలు కూడా కిక్ ఎక్కించేస్తున్నాయి. దాంతో ఈ సినిమాకి వ‌సూళ్లు బాగానే ద‌క్కుతున్నాయి. తొలి రెండు రోజులూ దాదాపుగా రూ.4 కోట్లు వ‌సూలు చేసింద‌ని ఓ అంచ‌నా. శుక్రవారం కాస్త డ‌ల్ గా క‌నిపించిన త‌డాఖా.. శ‌నివారం మాత్రం బాగా పుంజుకొంది. సండే మార్నింగ్ షోలు కూడా ఫుల్లుగా క‌నిపిస్తున్నాయి. సోమ‌వారం నుంచి ద‌క్కే వ‌సూళ్లని బ‌ట్టి… త‌డాఖా హిట్టా? ఏవ‌రేజా? అనే సంగ‌తి తెలుస్తుంది. ద‌గ్గర్లో పెద్ద సినిమాలేమీ లేక‌పోవ‌డం త‌డాఖాకి ప్లస్‌.