శామ్‌ చేసే పిచ్చి పనులు చైతూకు అస్సలు నచ్చడం లేదట

అక్కినేని యువహీరో నాగచైతన్య, టాలీవుడ్‌ అగ్రకథానాయిక సమంతతో గతకొంత కాలంగా ప్రేమలో ఉంటూ వస్తున్నాడు. ఈ ఏడాది మొదట్లో ఇద్దరికి నిశ్చితార్థం కూడా జరిగింది. ఈ ఏడాది చివరికల్లా వివాహం కూడా జరుగబోతుంది. పెళ్లి దగ్గరకు వచ్చే సమయానికల్లా చేతిలో ఉన్న ప్రాజెక్ట్‌లు అన్ని పూర్తి చేయాలని ఇద్దరు యమ బిజీగా షూటింగ్‌లలో పాల్గోంటున్నారు. సినిమాల పట్ల చాలా చురుగ్గా ఉంటే చైతూ పర్శనల్‌ విషయాలను ఇతరులతో పంచుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపడు. అందుకే సోషల్‌ మీడిచాలో చురుగ్గా ఉండడు. కానీ సమంత మాత్రం చైతూకు వ్యతిరేకి.

సమంత ఏ ఫొటోని అయినా వెంటనే సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి తెగ సంబరపడుతూ ఉంటుంది. ఆ ఫొటోలు తీసిందా అనే సమయానికే నెట్‌లో దర్శణం ఇస్తాయి. కానీ సమంత చేసే ఈ పిచ్చి పనులు చైతుకు అస్సలు నచ్చడం లేదట. తాజాగా అభిమానులతో ముచ్చటించిన చైతూను ఒకరు మీరెందుకు సోషల్‌ మీడియాలో చురుగ్గా పాల్గొనరు అని అడగ్గా, నాకు వ్యక్తిగత విషయాలను అలా షేర్‌ చేయడం ఇష్టం ఉండదు, కానీ సమంతకు ఇష్టం కాబట్టి నేనేమనను. ఒక లవర్‌గా తనకు కావాల్సివన్నీ చూసుకుంటాను అంతేకానీ ఇలా సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం నా వల్ల కాదు, ఈ పిచ్చి పనులు నాకు నచ్చకపోయినా కూడా సమంత కోసం ఊరుకుంటున్నా అని నవ్వుతూ చెప్పుకొచ్చాడు.