Site icon TeluguMirchi.com

Chaari 111 : సాహసాల యాత్ర.. ఆగదిక అంటున్న ‘చారి 111’


‘వెన్నెల’ కిశోర్ కథానాయకుడిగా నటించిన సినిమా ‘చారి 111’. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో సంయుక్తా విశ్వనాథన్ హీరోయిన్. బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ నిర్మిస్తున్నారు. మురళీ శర్మ ప్రధాన పాత్రధారి. మార్చి 1న థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా ‘చారి 111’ థీమ్ సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్.

“ఒక కన్ను భూగోళం.. ఒక కన్ను ఆకాశం.. విశ్వాన్ని వెతికేద్దాం.. పదా! ఓ.. చక చక మొదలిక.. సాహసాల యాత్ర ఆగదిక.. ఆపరేషన్ రుద్రనేత్ర” అంటూ సాగిన ఈ పాటను సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి రాయగా, ‘జవాన్’ ఫేమ్ సంజీత భట్టాచార్య ఆలపించారు. సైమన్ కె కింగ్ మంచి స్టైలిష్‌ ట్యూన్ అందించారు. భారీ సినిమాలకు తీసిపోని రీతిలో సినిమాను తెరకెక్కించారని స్టైలిష్‌గా పిక్చరైజ్ చేసిన థీమ్ సాంగ్‌ చూస్తే తెలుస్తోంది. ఇప్పుడు యూట్యూబ్‌లో ఈ సాంగ్ వైరల్ అవుతోంది.

Theme Of Chaari 111 | Vennela Kishore | Simon K King | Ramajogayya Sastry | Sanjeeta Bhattacharya

Exit mobile version