Site icon TeluguMirchi.com

సినిమాలో అమలా ఆలా ఉండదట..

అమలాపాల్ బోల్డ్ గా కనిపించి అందరికి పెద్ద షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు చాల పద్దతిగా ఎక్కడ అందాల ఆరబోత కు పెద్ద తావివ్వకుండా లిప్ లాక్ వంటి హాట్ హాట్ సన్నివేశాలకు సైతం దూరంగా ఉన్న అమలా..తాజాగా బోల్డ్ గా కనిపించే సరికి అందరు అయోమయంలో పడ్డారు. ఏంటి నిజంగా అమలేనా..అంటూ ఒకటికి రెండు సార్లు చూడడం మొదలు పెట్టారు.

రత్నకుమార్ డైరెక్షన్లో అమలా పాల్ తాజాగా ‘ఆడై’ అనే సినిమా చేస్తుంది. దీని తాలూకా ఫస్ట్ లో టీజర్ లో ఒంటిమీద నూలు పోగు లేకుండా కనిపించి ఆశ్చర్య పరిచింది. ఈ ధైర్యానికి అందరూ మెచ్చుకున్నారు. ఇక యూత్ అయితే ఈ టీజర్ చూసి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా..వెండితెర ఫై అమలా ను ఆలా ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆసక్తి గా ఉన్నారు. అయితే వారి ఆసక్తి సెన్సార్ బోర్డ్ అడ్డు చెప్పినట్లు తెలుస్తుంది. టీజర్ లో కనిపించిన ఈ సన్నివేశాలు.. సినిమాలో కనిపించబోవని అంటున్నారు. ఎడిటింగ్ లో వీటిని తొలగించారని తెలుస్తోంది. తొలగించిన వాటి ప్లేస్ లో వేరే సన్నివేశాలను ఉంచాలని సెన్సార్ బోర్డు సూచించినట్టు సమాచారం. మరి ఆ సన్నివేశాలు లేకపోతే అభిమానులు , ప్రేక్షకులు ఎలా తట్టుకుంటారో చూడాలి.

Exit mobile version