ప్రేమ… పెటాకులు !

brekupsసినీ తారల మనస్సులు ఎప్పుడు ఎలా మారుతాయో తెలియదు. సినిమాలో అయితే హీరో, హీరోయిన్స్ తమ ప్రేమను గెలిపించుకోవడానికి ప్రాణాలను సైతం పణంగా పెడుతారు.అదే సినీ తారలు నిజ జీవితంలో మాత్రం ఎంత గాఢంగా ప్రేమించుకున్న కూడా ఎదో విధంగా వారి ప్రేమకు పుల్ స్టాప్ పడుతుంది.

కొందరు సిని ప్రేమికులు చాలా కాలంగా ప్రేమించుకుని పెళ్లి చేసుకుని కూడా దూరమైన సందర్భాలు ఉన్నాయి.ఇంకోందరూ చాలా డీప్ లవ్ లో ఉండి కూడా బ్రేక్ అప్ అయి వేరొకరితో ప్రమయాణం నడుపుతున్నారు. అలాంటి కొందరి సినీ లవర్స్ పై తెలుగు మిర్చి స్పెషల్ స్టోరీ..

picదేశం గర్వించదగ్గ నటుడు కమల్ హాసన్. సినిమాల్లో మాదిరే నిజజీవితంలో కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ ఎవో కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు. కమల్ , సారిక చాలా సినిమాల్లో కలిసి నటించారు.సినిమాలు చేసే టైంలోనే వీరి మధ్య ప్రేమ చోటుచేసుకోవడంతో పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత వారికి ఇద్దరూ కుమార్తెలు కూడా జన్మించారు. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న శృతిహాసన్ ఒక కుమార్తె కాగా రెండో కుమార్తె పేరు అక్షరహాసన్. అయితే కమల్ సారికతో విడాకులు తీసుకుని గౌతమి అనే హీరోయిన్ తో కొంత కాలంగా కలిసి ఉంటున్నాడు.సారిక మాత్రం పిల్లలతో ఉంటుంది.

katబాలీవుడు కండల వీరుడు సల్మాన్ ప్రేమ గురించి అనడం కన్నా ప్రేమకథల గురించి అనడం కరెక్ట్ ఎందుకంటే సల్లు చాలా మంది హీరోయిన్స్ ని ప్రేమించాడు. కానీ ఎవరితో ఆయన ప్రేమ పెళ్లి పీటల వరకు సాగలేదు.దాంతో ఆయన ఇప్పటికి బ్యాచిలర్ గానే ఉంటున్నాడు. మొదట సంగీత బిలానీ తో లవ్ లో పడ్డాడు సల్మాన్ .ఈ ఇద్దరు చాలా డీప్ గా ప్రేమించుకున్నారు.కానీ ఎందుకో విడిపోయారు. సంగీత బిలానీ తరువాత మాజీ ప్రపంచసుందరి ఐశ్వర్యరాయ్ తో చాలా సిరియస్ గా ప్రమయాణం కొనసాగించాడు. ఐస్ కూడా కండలవీరుడిని చాలా ఇష్టపడింది.కానీ మనోడి కోపం వల్ల ఐశ్వర్య దూరమైంది.దీంతో చాలా కాలం పాటు మనసికంగా కుంగిపోయిన సల్లు తరువాత లండన్ భామ కత్రినాకైఫ్ ను హీరోయిన్ గా పరిచయం చేయడమేకాకుండా ఆమెను లవ్ చేశాడు.కత్రినా కూడా బాగానే సల్లుతో రోమాన్స్ నడిపింది.కానీ ఈ మధ్య వీరు సైలెంట్ అయిపోయారు.దీంతో అసలు వీరు లవర్సా లేదా మాములుగానే ఉంటున్నారా అని బాలీవుడు జనాలు అనుకుంటున్నారు. ప్రస్తుతం సల్మాన్ జర్మనీ రేడియో జాకీతో ఎపైర్ నడుపుతున్నాట్లు టాక్.ఇలా ప్రేమిస్తున్నాడు కానీ ఎవరితో మ్యాచ్ కుదరకపోయే సరికి ఇప్పటికి సల్మన్ మోస్ట్ వాంటెండ్ బాలీవుడు బ్యాచిలర్ గానే ఉన్నాడు.

johnaబాలీవుడు లో చాలా కాలంగా గాఢంగా ప్రేమించుకున్నా జంట జాన్ అబ్రహం,బిపాషా బసు.వీరిద్దరూ మోడలింగ్ రంగం నుంచి సిని రంగానికి వచ్చారు.మొదట వీరు జిస్మ్ సినిమాతో జతకట్టారు.ఈ సినిమాలో వీరు పడించిన రోమాన్స్ అప్పట్లో బాలీవుడులో హార్ట్ టాపిక్ మారింది.ఇక అప్పటి నుంచి వారు వ్యక్తిగత జీవితంలో కూడా ప్రేమికులుగా మారారు.సుమారు ఎడేళ్లుగా వీరు ప్రేమలో మునిగితేలారు.డేటింగ్ కూడా చేశారు.ఈ విషయాన్ని చాలా సార్లు బహాటంగా ఒప్పుకున్నారు. జాన్, బిపాషా కచ్చితంగా పెళ్లి చేసుకుంటారని బాలీవుడు జనాలు ఊహించారు.కానీ వీరు చివరికి మాజీ ప్రేమికులుగా మిగిలిపోయారు.

dhoniహాట్ లవ్ స్టోరీస్ లో నడుపడంలో దీపికపదుకునే చాలా స్పీడు అనే చెప్పాలి.సినిమాల్లో మాదిరే ఈ అమ్మడు ఎప్పటికప్పుడు తన బాయ్ ప్రెండ్ ని మార్చేస్తుంది. ఓం శాంతి ఓం సినిమాతో బాలీవుడులో అడుగుపెట్టిన కన్నడ బ్యూటీ మన ప్రజెంట్ క్రికెట్ కెప్టెన్ ధోనీని క్లీన్ బౌల్డ్ చేసింది.ఎంతో ప్రేమగా పెంచుకున్న జట్టును కూడా తన కోసం త్యాగం చేశాడు జార్ఖండ్ డైమండ్. ధోనీ తరువాత కొన్ని రోజులు యువరాజు సింగ్ తో ఎపైర్ నడిపింది.ఆ తరువాత కింగ్ ఫిషర్ ఓనర్ విజయ్ మాల్యా కొడుకు సిద్దార్థ్ మాల్యాతో కూడా చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. సిద్దార్ధ్ మాల్యాకు చెందిన కంపెనీలు దివాలా తీయడంతో ఈ వయ్యారి భామ బాలీవుడు చాక్లెట్ బాయ్ రణబీర్ కపూర్ తో సిరియస్ గా లవ్ లో పడింది.కానీ రణబీర్ తల్లికి దీపిక వ్యవహారం నచ్చకపోవడంతో ఇద్దరు దూరమైయ్యారు.కానీ ఇప్పటికి రణబీర్ అంటే తనకు చెప్పలేనంత ఇష్టమని మొన్నీ మధ్య ఓ వేడుకలో చెప్పింది.ప్రస్తుతం దీపిక రామ్ లీలా సినిమా హీరో రణవీర్ సింగ్ తో ఎపైర్ నడుపుతున్నాట్లు బాలీవుడులో టాక్ నడుస్తుంది.మరి ఈ లవ్ ఎంత కాలం సాగుతోందో చూడాలి.

sidకపూర్ల వంశం నుంచి హీరోయిన్ గా వచ్చిన కరీనా కపూర్ కూడా హాట్ లవ్ స్టోరీస్ నడిపింది.బాలీవుడులో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు లవ్ విషయంలో కూడా బాగా పాపులర్ అయింది. బాలీవుడు యువ హీరో షాహిద్ కపూర్,కరీనాకపూర్ల ప్రేమ బాలీవుడులో కొంత కాలంగా హాల్ చల్ చేసింది.వీరిద్దరూ ‘జబ్ వీ మెట్’ సినిమాలో జంటగా నటించారు.ఆ సినిమా సూపర్ హిట్టు అయింది.ఆ టైంలోనే ప్రేమికులుగా మారిన ఈ జంట నైట్ క్లబ్ లో పెట్టుకున్న ముద్దుల వ్యవహారం అప్పట్లో మీడియాలో పాపులర్ అయ్యాయి. దీంతో ఈ బ్యూటీ మీడియా పై అగ్గిమీద గుగ్గిలం అయింది. షాహిద్ తో లవ్ ఎపైర్ బెడిసికొట్టిన తరువాత ఛోటా నవాబ్ సైఫ్ అలీఖాన్ తో ఎపైర్ నడిపింది కరీనా. చాలా కాలం వరకు వీరు డేటింగ్ చేసి ఈ మధ్య పెళ్లి కూడా చేసుకున్నారు. సైఫ్ అలీఖాన్ కూడా అంతకు ముందు అమృతసింగ్ అనే బాలీవుడు నటిని వీర లెవల్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.వీరికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు.ఎవో కారణాల వల్ల విడాకులు తీసుకున్నా సైఫ్ సుస్మీత సేన్, బిపాషా బసులతో కూడా ఎపైర్ నడిపిన చరిత్ర ఉంది.

reenaబాలీవుడు మిస్టర్ పర్ పెక్ట్ గా పేరు తెచ్చుకున్న అమిర్ ఖాన్ పర్సనల్ లైఫ్ లో మాత్రం ప్లేబాయ్ గానే మిగిలాడు. తన సినిమాలతో బాలీవుడులో మిస్టర్ పర్ పెక్ట్ అనిపించుకున్న అమీర్ ఖాన్ లైఫ్ లో మాత్రం లవ్ ఎపైర్స్ తో సహవాసం చేశాడు. చిన్నతనం నుంచే అమీర్ కి లవ్ స్టోరీస్ బాగానే నడిపాడు.రీనా అనే యువతి ప్రేమించి మరి పెళ్లిచేసుకున్నాడు.సుమారు పదహారేళ్లు గా సాఫీ గా రీనా కాపురం సాగి ఇద్దరు పిల్లలకు తండ్రి కూడా అయ్యాడు. కానీ కిరణ్ రావు రాక తో పదహారేళ్లు కాపురం చేసిన రీనాకు విడాకులిచ్చి కిరణ్ రావు ను పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వీరి మధ్య కూడా పొరపొచ్చాలు వచ్చాయని టాక్

nayan1సినీ లవ్ ఎఫైర్స్ ఎక్కువగా బాలీవుడులోనే ఉంటాయి.కానీ దక్షణాదిలో లవ్ ఎపైర్స్ తో నిత్యం వార్తల్లో నిలిచే హీరోయిన్ నయన తార అని చెప్పాలి. మళీయళం నుంచి తమిళ ఇండస్ట్రీకి షిష్ట్ అయిన నయనతార మొదట తమిళ హీరో శింబుతో గాఢంగా ప్రేమలో మునిగిపోయింది.దాదాపు వీరు పెళ్లి చేసుకుంటారని అందురు అనుకున్నారు.కానీ అనుకోని విధంగా వీరి మధ్య విభేదాలు వచ్చాయి.దీంతో వీరి లవ్ బ్రేక్ అప్ అయింది.కొంత కాలం శింబు నయన్ కోసం తపించాడు.కానీ నయన్ మాత్రం శింబుకి దూరంగా ఉంది.

prabahuఆ తరువాత నయనతార డాన్స్ మాస్టర్ ప్రభుదేవాతో ఎపైర్ నడిపింది.దీంతో ప్రభుదేవా తన పిల్లలను భార్యను కాదని నయన్ తో చెట్టాపట్టాలేసుకుని విదేశాల వెంట తిరిగాడు.వీరుకూడా దాదాపు ఒక్కటవుతారని అందరు ఊహించారు.ప్రభుదేవా కోసం మతం కూడా మరడానికి నయన్ సిద్దపడింది.కానీ ప్రభుదేవా హ్యండ్ ఇవ్వడంతో ఈ అమ్మడి తేరుకోలేకపోయింది. ప్రస్తుతం నయన్ తమిళ హీరో ఆర్యతో ఎపైర్ నడుపుతున్నట్టు టాక్ వినిపిస్తుంది.

ఇతరులకు ఆదర్శంగా ఉండాల్సిన హీరో హీరోయిన్స ఇలా బంధాలను దూరం చేసుకోవడామే కాకండా ప్రేమ అనే మాట వారికో ఆట వస్తువుగా మారిపోయింది ఇలా చాలా మంది హీరో హీరోయిన్స్ ప్రేమ మూడునాళ్ల ముచ్చటగానే మిగిలిపోతుంది.