కరోనా క్రైసిస్ ఛారిటీకి ఎంతమంది..ఎంతెంత విరాళాలు ఇచ్చారంటే

లాక్ డౌన్ కారణంగా సినీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ‘మనకోసం’ పేరిట కరోనా క్రైసిస్ ఛారిటీని ఏర్పాటు చేసి వారికీ సాయం అందించే నిర్ణయం తీసుకున్నారు. ఆయన విజ్ఞప్తి మేరకు తెలుగు సినిమా నటులు, దర్శకులు, నిర్మాతలు ముందుకొచ్చారు. ఎవరి శక్తిమేర వారు విరాళాలు అందజేశారు. మార్చి 28న ఈ ఛారిటీని ఏర్పాటు చేయగా నాలుగు రోజుల్లో రూ.6.2 కోట్ల విరాళాలు అందాయి.

ఈ విషయాన్ని చిరంజీవి ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘‘కరోనా క్రైసిస్ ఛారిటీ ద్వారా రూ.6.2 కోట్లు సేకరించాం. ఈ నిధికి తమ వంతు సాయం చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వకంగా కృజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ సాయం అందించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అభ్యర్థిస్తున్నా’’ అని చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇప్పటివరకు ఈ ఛారిటీ కి ఇచ్చిన వారి లిస్ట్ మీరే చూడండి.

* చిరంజీవి – కోటి రూపాయలు
* నాగార్జున – కోటి రూపాయలు
* ప్రభాస్ – రూ.50 లక్షలు
* రామ్ చరణ్ – రూ. 30 లక్షలు
* నాని – రూ. 30 లక్షలు
* ఎన్టీఆర్ – రూ. 25 లక్షలు
* నాగచైతన్య – రూ. 25 లక్షలు
* అల్లు అర్జున్ – రూ. 20 లక్షలు
* వరుణ్ తేజ్ – రూ. 20 లక్షలు
* రవితేజ – రూ. 20 లక్షలు
* శర్వానంద్ – రూ. 15 లక్షలు
* శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ – రూ. 10 లక్షలు
* యూవీ క్రియేషన్స్ – రూ. 10 లక్షలు
* సాయిధరమ్ తేజ్ – రూ. 10 లక్షలు
* విశ్వక్ సేన్ – రూ. 5 లక్షలు
* శ్రీకాంత్ – రూ. 5 లక్షలు
* శ్రీమిత్ర చౌదరి – రూ. 5 లక్షలు
* సుశాంత్ – రూ. 2 లక్షలు
* కార్తికేయ – రూ. 2 లక్షలు
* వెన్నెల కిషోర్ – రూ. 2 లక్షలు
* సప్తగిరి – రూ. 2 లక్షలు
* లావణ్య త్రిపాఠి – రూ. 1 లక్ష
* సంపూర్ణేష్ బాబు – రూ. 1 లక్ష
* బ్రహ్మాజీ – రూ. 70వేలు