కరోనా క్రైసిస్ ఛారిటీ మన కోసం(సీసీసీ) ద్వారా రేపటి నుంచి సరకులు, మందులు అందజేయనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. సినీ కార్మికుల సంక్షేమం కోసం నటుడు చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీసీ కి నటులు, దర్శక నిర్మాతల నుంచి ఇప్పటి వరకు రూ. 7 కోట్లకుపైగా విరాళాలు సమకూరాయి. 24 విభాగాల్లోని నిరుపేద సినీ కార్మికుల జాబితాను సిద్ధం చేసిన సీసీసీ వారికి కావాల్సిన నిత్యావసరాలను అందించనుంది.
ఇప్పటికే మెడిసిన్స్ కోసం ఇబ్బందులు పడుతున్న వారికి చిరంజీవి, రామ్‌చరణ్, ఉపాసనల సహకారంతో ఇంటికే మందులు పంపించే ఏర్పాటు చేయడం జరిగింది. 500 నుంచి 1000 రూపాయల విలువ చేసే మందులు అందజేసామని, ఇండస్ట్రీలోని కార్మికులంతా తమ అసోసియేషన్స్ ద్వారా ఇబ్బందులను తెలియజేస్తే వారి ద్వారా మీకు సహాయసహకారాలను అందిస్తామని కమిటీ సభ్యులు చెప్పారు