Site icon TeluguMirchi.com

క్యాథరిన్‌ ఇప్పుడు బాధపడుతుందట..

catherine-laxmi

మెగా హీరోస్ తో జతకట్టి మెగా అభిమానుల్లో బాగా పాపులర్ అయిన క్యాథరిన్‌ , ఇప్పుడు తెగ బాధపడుతుందట..అంతే కాదు రాయ్ లక్ష్మి ని చూసి ఈర్షపడుతుందట..ఎందుకో అర్ధం అయ్యిందా..కాలేదా అయితే ఈ స్టోరీ చూడండి..

మెగా స్టార్ నటించిన ఖైదీ నెం 150 లో ఐటెంసాంగ్‌ కోసం ముందు క్యాథరిన్‌ అనుకున్నారు. సెట్లో చిరు కూతురు సుస్మిత తో డ్రెస్ విషయం లో జరిగిన గొడవతో క్యాథరిన్‌ ఆ పాట నుంచి తప్పించి , ఆ ప్లేస్ లో లక్ష్మీరాయ్‌కి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఈ సినిమా పబ్లిసిటీలో ఈ పాటను, అందులో లక్ష్మీరాయ్‌ డ్యాన్స్‌ను బాగా ప్రమోట్‌ చేయడం తో లక్ష్మీరాయ్‌కి ఎక్కడలేని పబ్లిసిటీ వచ్చేస్తోంది..అంతే కాదు ఈ మూవీ తర్వాత లక్ష్మీరాయ్‌కి మరిన్ని తెలుగు లో అవకాశాలు రాబోతాయని అందరూ చెప్పడం తో అది చూసి క్యాథరిన్‌ తెగ బాధపడుతోందట..కాస్త ఓపికగా ఉండి, ఉంటె ఆ పబ్లిసిటీ అంతా నాకే దక్కి ఉండేది కదా అని సన్నిహితుల దగ్గర చెప్పుకొని తెగ ఫీల్ అవుతుందట.

మరో పక్క ఖైదీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రేపు ప్రేక్షకుల ముందుకు గ్రాండ్ గా విడుదల కాబోతుంది..

Exit mobile version