ఎన్నో ఆశలు పెట్టుకుని సినీ పరిశ్రమలోకి వచ్చిన కొత్త హీరోయిన్ కేథరిన్ త్రెసాకు చెప్పుకోదగ్గ పెద్ద ప్రాజెక్ట్‌లు ఏవి తగలలేదు. హీరోయిన్‌గా అవకాశాలు రాకపోవడంతో ఈ అమ్మడు ఐటెంగా ఆడిపాడడానికి కూడా సై అంది. మెగాస్టార్ చిరంజీవి ‘ఖైది నెం. 150’ చిత్రంలో ప్రత్యేక పాటలో నర్తించే అవకాశం వచ్చి పలు కారణాల వల్ల మిస్ అయ్యింది. ఆ తర్వాత ఈ అమ్మడికి తెలుగులో ప్రాజెక్ట్‌లు కరువయ్యాయి. ప్రస్తుతం తమిళంలో అడపాదడపా చిత్రాల్లో నటిస్తోంది. టాప్ హీరోయిన్ అవాలనుకున్న ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలే రావడం లేదు.
తాజాగా ఓ ఇంటర్య్వూలో ముచ్చటించిన కేథరిన్‌ను మీ అందాన్ని కాపాడుకోవడానికి ఏం చేస్తారు అని అడగగా అందాన్ని చూసే మమ్మల్ని ఆదరిస్తారు కదా. మా ఒంటి సోయగంతోనే చూడడానికి ఇష్టపడుతారు కాబట్టి నా శరీర సోయగాన్ని కాపాడుకోవడానికి రోజు యోగా చేస్తాను. అలాగే ఆహార విషయంలో కూడా చాలా శ్రద్ద వహిస్తాను. అందంగా కనిపించడం కోసం ఇంకా చాలా చాలా చేస్తుంటాం ఆకట్టుకోవడానికి ఇదంతా తప్పదు, అందంగా ఉంటేనే కదా ఆకట్టుకునేది అని ఈ అమ్మడు చెబుతోంది. మొత్తానికి అవకాశాల మాట ఎలా ఉన్నా కూడా కేథరిన్ అందం పట్ల ఏమాత్రం అశ్రద్ద చేయడం లేదు.