Site icon TeluguMirchi.com

నిర్మాత కూతురుకి కరోనా తగ్గింది

బాలీవుడ్ సింగర్ కనికా కపూర్‌కు కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమెను క్వారంటైన్‌లోకి పంపించారు. దిని తర్వాత బాలీవుడ్ లో మరో సంచలనం రేకెత్తించింది. కనికా కపూర్ స్నేహితురాలు, బాలీవుడ్ నిర్మాత కరీమ్ మొరానీ కుమార్తె షాజా మొరానీకి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.

అయితే ఇప్పుడు ఆమె నెగిటివ్ గా తేలింది. వైద్యులు ఆమెను డిశ్చార్జ్‌ చేశారు. భారత్‌లో లాక్‌డౌన్‌కు ముందు ఆమె విదేశాల నుంచి భారత్‌కు వచ్చారు. స్వీయ నిర్బంధంలో ఉన్నారు. మార్చి చివర్లో కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఇంట్లో ఉన్న వారందర్నీ పరీక్షించగా.. నిర్మాతకు, ఆయన మొదటి కుమార్తెకు కూడా కరోనా పాజిటివ్‌ తేలింది. దీంతో వీరిని నానావతి ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం నిర్మాత రెండో కుమార్తె కోలుకున్నట్లు వైద్యులు నిర్ధారించి ఇంటికి పంపించారు.

Exit mobile version