Site icon TeluguMirchi.com

ఏపీలో తొలి కరోనా మరణం

ఆంధ్రప్రదేశ్‌లో తొలి కరోనా మరణం నమోదైంది. విజయవాడకు చెందిన వ్యక్తి(55) కరోనా వైరస్‌తో బాధపడుతూ మృతి చెందినట్లు వెల్లడైంది. కరోనా మరణాన్ని ప్రభుత్వం ధ్రువీకరించింది. మార్చి 30న ఉదయం 11.30గంటలకు చెకప్‌ కోసం ఆసుపత్రికి వచ్చారని, గంట వ్యవధిలో మధ్యాహ్నం 12.30గంటలకు ఆ వ్యక్తి చనిపోయాడని ప్రభుత్వం ప్రకటించింది. కుమారుడి నుంచి తండ్రికి వైరస్‌ సోకిందని వైద్యులు భావిస్తున్నారు.

ఇదీలావుంటే ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 161కి చేరిందని వైద్య ఆఆరోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌లో ప్రకటించింది. గురువారం రాత్రి 10 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9గంటల వరకు కొత్తగా 12 కేసులు నమోదయ్యాయని తెలిపింది. కొత్తగా నమోదైన కేసుల్లో నెల్లూరు 8, విశాఖలో 3 ఉన్నాయి.

Exit mobile version