పెంపుడు జంతువుల ద్వారా మనుషులకు కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందన్న వార్తలను ప్రజలెవరూ నమ్మవద్దని బ్లూక్రాస్ ప్రతినిధి అక్కినేని అమల విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని అమె తెలిపారు. అనవసరంగా ఆందోళనలు కలిగించే ఇలాంటి అసత్య ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మొద్దని సూచించారు.
కరోనా నేపధ్యంలో చాలా రూమర్స్ వస్తున్నాయి. చికెన్ తిన్నా కరోనా వస్తుందని కొన్నాళ్ళు ప్రచారం జరిగింది. చికెన్ మానేశారు జనాలు. ఇప్పుడు పెంపుడు జంతువుల ద్వారా మనుషులకు కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందన్న వార్తలు వచ్చాయి. దీంతో అమల ఖండించారు.