Site icon TeluguMirchi.com

‘కామెడీ’ వుడ్

taliwood-comediansటాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ మాదిరిగా.. కొత్తదొకటి పుట్టుకొచ్చింది. ఎక్కడో కాదు మన టాలీవుడ్ లోనే. ముప్పై, నలబై కోట్ల బడ్జెట్ అయినా, బడా హీరోలున్నా, అందమయిన అమ్మాయిలున్నా పబ్లిసిటీ అంతా కమెడియన్ల మీదే ఆధారపడుతుంటే ఇలా గాక మరేలా అనాలి. టీవీలో వస్తున్న కొత్త సినిమాల ప్రోమోలన్నీ చూడండి. అన్నింటిలోనూ కామన్ పాయింట్ కమెడియన్లే. సాధారణంగా సినిమా విడుదలకు ముందు, విడుదలైన మొదటివారం ప్రొమోలన్నీ కేవలం హీరో, తప్పితే హీరోయిన్ తప్ప మరో నటుడు కనిపించే అవకాశమే వుండేది కాదు. కానీ ఇప్పుడు ట్రెండు మారిపోయింది. కమెడియన్లను, కామెడిని నమ్ముకొనే సినిమా కొస్తున్నారు. అందుకే నిర్మాతలు కూడా ఈ తరహా ప్రొమోలను తయారుచేస్తున్నారు. తాజాగా షాడో ప్రోమోలు మొదటివారానికి హీరో వెంకటేష్ పై నుంచి కమెడియన్ ఎంఎస్ నారాయణ వైపుకు మారిపోయాయి. శుక్రవారం విడుదలవుతున్న గ్రీకువీరుడు సినిమాకోసం అచ్చంగా కమెడియన్లతోనే ఓ ప్రోమో తయారు చేశారు. నాగార్జున, నయనతారల ప్రోమోతో సమానంగా దీన్ని ప్రచారానికి వినియోగించడం విశేషం.

Exit mobile version