తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో దిల్‌రాజు ‘యాక్టివ్ ప్యానల్’ పేరుతో పోటీ చేయడం జరిగింది. దిల్‌రాజుకు పోటీగా సి కళ్యాణ్ ‘మన ప్యానల్’ పేరుతో పోటీ చేయడం జరిగింది. దిల్‌రాజుకు పెద్ద నిర్మాతల సపోర్ట్ ఉండగా, సి కళ్యాణ్ చిన్న నిర్మాతలు సపోర్ట్ చేశారు. దాంతో సి కళ్యాణ్ ఘన విజయం సాధించడం జరిగింది. మొత్తం 20 మంది సెక్టార్ మెంబర్స్‌కు గాను 16 మంది మన ప్యానల్ నుండి ఎన్నిక అవ్వడం జరిగింది.
దిల్‌రాజు ప్యానల్ నుండి కేవలం 4 మాత్రమే ఎంపిక అయ్యారు. ఈ ఎన్నికల్లో దిల్‌రాజు మరియు దామోదర ప్రసాద్‌లు ఈసీ మెంబర్స్‌గా ఎన్నిక అయ్యారు. దిల్‌రాజు మొదటి నుండి చిన్న నిర్మాతలకు వ్యతిరేకంగా ఉంటూ వచ్చాడు. థియేటర్లు అన్ని కూడా దిల్‌రాజు ఆధీనంలో ఉంచుకుని విడుదల సమయంలో ఇబ్బంది పెడుతున్నాడు అంటూ టాక్ ఉంది. అందుకే చిన్న నిర్మాతలు అంతా కూడా సి కళ్యాణ్ వైపుకు మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది.