సునీత విమర్శలకు బన్నీ వాసు వివరణ

పవన్‌ కళ్యాణ్‌ తనను వాడుకుని ఇప్పుడు కష్టాల్లో ఉన్న నన్ను ఆదుకోవడం లేదంటూ జూనియర్‌ ఆర్టిస్టు సునీత ఇటీవల ఫిల్మ్‌ ఛాంబర్‌ లో తనను తాను బంధించుకున్న విషయం తెల్సిందే. అల్లు అరవింద్‌ తన విషయంలో స్పందించాలని ఆమె డిమాండ్‌ చేసిన నేపథ్యంలో ఆమె విమర్శలకు స్పందించేందుకు మెగా కాంపౌండ్‌ కు చెందిన బన్నీ వాసు మీడియా ముందుకు వచ్చాడు.

బన్నీ వాసు మాట్లాడుతూ.. జనసేన కోసం పనిచేసినంత మాత్రాన సినిమాల్లో అవకాశాలు వస్తాయని ఎలా భావిస్తారు. సినిమాల్లో నటించే ముఖ్య నటీనటుల గురించి తప్ప ఇతరులు ఎవరు నటిస్తున్నారు అనే విషయాన్ని మేము అస్సలు పట్టించుకోము. అవకాశాలు కావాలని వస్తే ఆడిషన్స్‌ జరుగుతున్నాయి వెళ్లమని చెప్తాం. ఆమె కొన్ని ఆడిషన్స్‌ కు కూడా వెళ్లింది. పోలీసులు నిన్ను తీసుకు వెళ్లిన సమయంలో కేసు నమోదు చేయవద్దని నేను వారికి ఫోన్‌ లో చెప్పాను. ఇలా చేస్తే సానుభూతి దక్కి అవకాశాలు వస్తాయని నువ్వు అనుకున్నావంటూ బన్నీ వాసు చెప్పుకొచ్చాడు.