తాగి కారు న‌డిపలేదు: బ‌న్నీ

bunny

అల్లు అర్జున్ తాగి కారు న‌డిపాడా? పోలీసుల్ని మేనేజ్ చేసి… ఫైన్ ప‌డ‌కుండా త‌ప్పించుకొన్నాడా?? మీడియాలో ఇదే హాట్ టాపిక్‌. సోమ‌వారం రాత్రి జూబ్లీ హిల్స్ ద‌గ్గ‌ర గీతా ఆర్ట్స్ ఆఫీసు స‌మీపంలో బ‌న్నీ కారుని పోలీసులు అడ్డుకొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని చూశారు. అయితే అప్పికే అక్క‌డ మీడియా పోగైపోయింది. మీడియా ముందు మౌత్ టెస్ట్ చేయించుకోవ‌డం ఇష్టం లేని బ‌న్నీ… పోలీసుల్ని ప‌క్క‌కు ర‌మ్మ‌న్నాడు. అనంత‌రం ప‌రీక్ష చేసిన పోలీసులు బ‌న్నీని విడ‌చిపెట్టారు. ఒక‌వేళ బ‌న్నీ తాగి ఉండ‌క‌పోతే.. పోలీసుల్ని ప‌క్క‌కు తీసుకెళ్లాల్సిన అవ‌స‌రం ఏమిట‌న్న‌ది కొంద‌రి ప్రశ్న‌, ఈ విష‌యంపై బ‌న్నీ కూడా కాస్త ఘాటుగానే స్పందించాడు. ”నాపై నెగిటీవ్ ప్రోప‌కాండ జ‌రుగుతోంది. ఓ ఛాన‌ల్ ఆ వీడియోని త‌ప్పుగా ఎడిట్ చేసి.. దుష్ఫ‌చారం చేయ‌డానికి చూస్తోంది. నిజానికి నేను ఆ స‌మ‌యంలో తాగి లేను. ఒక‌వేళ తాగితే ఎప్పుడూ డ్రైవింగ్ చేయ‌లేదు. ఆటోలోనో, టాక్సీలోనో వెళ్తా. లేదంటే మ‌రొక‌రిని డ్రైవ్ చేయ‌మంటా. తాగి బండి న‌డిపిన వారెవ్వ‌రైనా హైద‌రాబాద్ పోలీసులు క్ష‌మించ‌రు..” అని బ‌న్నీ ఫేస్ బుక్‌లో కామెంట్ పోస్ట్ చేశాడు.