చిరు డైరెక్టర్ కు నో చెప్పిన బన్నీ..

Allu-Arjun-wish-pawan

వరుస సక్సెస్ లతో ఫుల్ జోష్ మీద ఉన్న అల్లు అల్లు అర్జున్ తాజాగా మెగాస్టార్ చిరంజీవి ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ కు నో చెప్పాడట. ఆగడు ముందు వరకు విజయాలను చవిచూసిన శ్రీను వైట్ల..ఆ తర్వాత ఆగడు, బ్రూస్ లీ చిత్రాల డిజాస్టర్స్ తో వెనుకపడ్డాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ తో మిస్టర్ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ మూవీ రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదిలా ఉండగానే మరో రెండు కథలను రెడీ చేసి బన్నీ కి వినిపించడం జరిగిందట.

Srinu-Vaitla-sale-for-house
అయితే ఈ కథలు బన్నీ కి నచ్చక పోవడం తో శ్రీను కు నో చెప్పాడని సమాచారం. ఈ కథను శ్రీను వైట్ల అల్లు అర్జున్ కోసమే రాసుకున్నాడని, కానీ కథ అల్లు అర్జున్ తనకు నచ్చలేదని సున్నితంగా చెప్పాడట !! దాంతో అయోమయంలో పడ్డ శ్రీను వైట్ల నిజానికి మిస్టర్ కథను కూడా అల్లు అర్జున్ కు వినిపించినట్టు సమాచారం. మరి మళ్ళీ మహేష్ బాబు తో సినిమా చేయడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడట. ఇప్పటికే మహేష్ కొరటాల శివ, వంశీ పైడిపల్లి, త్రివిక్రమ్ ల దర్శకత్వంలో సినిమాలు క్యూ లో పెట్టాడు, మరి శ్రీను వైట్ల కు మహేష్ అవకాశం ఇస్తాడో లేదు చూడాలి !!