బన్నీ డ్యూయల్ రోల్ చేస్తున్నాడా..?

అల వైకుంఠపురం లో చిత్రం తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ …ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ స్మగ్లర్ లకి సహకరించే లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నాడని అంటున్నారు. ఈ పాత్ర లో బన్నీ చాల రఫ్ గా కనిపిస్తాడని.. రింగుల జుట్టుతో .. గుబురు గెడ్డంతో ఆయన లుక్ కొత్తగా ఉంటుందని సమాచారం.

కాగా ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ చేయబోతున్నాడని.. ఆ లుక్ కాస్త స్టైలీష్ గా .. మోడ్రన్ గా ఉంటుందని అంటున్నారు. మరి ఇది నిజామా కదా అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ పూర్తి అయ్యింది. మర్చి లో రెండో షెడ్యూల్ మొదలు పెట్టనున్నారని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి దేవి శ్రీ సంగీతం అందిస్తున్నాడు.