బ‌న్నీ డైరెక్టర్ అయిన వేళ‌..!

allu arjunస్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌- ఇప్పుడు డైరెక్టర్ కూడా అయిపోయాడు. కెప్టెన్ కుర్చీలో కూర్చుని, మెగాఫోన్ ప‌ట్టుకొని డైరెక్టర్ హోదా అనుభ‌వించేశాడు. వైవిఎస్ చౌద‌రి ద‌ర్శక‌త్వం వ‌హించిన చిత్రం.. ‘రేయ్’. ఈ సినిమాలో ఒక్క షాట్ కి బ‌న్నీ డైరెక్షన్ చేశాడ‌ట‌. అది ఈ సినిమాకి కీల‌క‌మైన షాట్ అని ద‌ర్శకుడు చెబుతున్నాడు. ”బ‌న్నీతో నాకు మంచి దోస్తీ ఉంది. అత‌ను హీరో కాక‌ముందునుంచీ నాకు తెలుసు. దేవాదాస్ స్ర్కిప్టు అత‌ని చేతుల‌మీదుగానే అందుకొన్నా. ఆ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. ‘రేయ్‌’లో కూడా బ‌న్నీ ప్రమేయం ఉంటే బాగుంటుంది అనిపించింది. ఓరోజు అన్నపూర్ణ స్టూడియోలో రేయ్ షూటింగ్ చేస్తున్నాం. ఆ ప‌క్కనే ఇద్దర‌మ్మాయిల‌తో చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. మా షూటింగ్ చూడ్డానికి బ‌న్నీ వ‌చ్చాడు. అప్పుడు ప‌తాక స‌న్నివేశాల్లో వ‌చ్చే ఓ పాట‌ను తెర‌కెక్కిస్తున్నాం. అందులో ఓ షాట్‌.. బ‌న్నీ డైరెక్ట్ చేశాడు..” అని చెబుతున్నారు చౌద‌రి.