యువ కథానాయకులంతా సినిమా నిర్మాణంలో పాలుపంచుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మంచు విష్ణు, మనోజ్‌లు ఆల్రెడీ నిర్మాతలుగా మారారు. నాని కూడా ఈబ్యాచ్లో చేరాడు. ఇప్పుడు మరో మెగా హీరో నిర్మాతగా మారడానికి సన్నాహాలు చేస్తున్నాడు. తనే.. అల్లు అర్జున్. తన స్నేహితుడు బన్నీ వాసుతో కలసి బీ బ్యాచ్ ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపిస్తున్నారట. ఈ బ్యానర్లో కొత్త వారితో సినిమాలు చేయాలని అల్లు అర్జున్ ప్లాన్ చేస్తున్నాడు. తొలి అవకాశం.. మారుతికి దక్కిందట. ఈ సంస్థ తరపున కొత్త ఆలోచనలతో వచ్చిన దర్శకులను ప్రోత్సహిస్తారట. బీ బ్యాచ్‌లో మరి కొంత మంది స్నేహితులనూ చేర్చుకొంటున్నాడు బన్నీ. ఇంట్లో గీతా ఆర్ట్స్ ఉండనే ఉంది. ఇప్పుడు మరో సంస్థ పుట్టింది. ఈ సంస్థలో ఎలాంటి సినిమాలొస్తాయో చూడాలి. మొత్తమ్మీద అల్లు అరవింద్‌కి ఇంట్లోనే పోటీ తయారైందన్నమాట.