గోన‌గ‌న్నారెడ్డిగా బ‌న్నీ

Alluarjun-in-Rudrama-Devi
గుణ‌శేఖ‌ర్ క‌ల‌ల చిత్రం…. రుద్ర‌మ‌దేవి. ఇప్ప‌టికే భారీ స్టార్ కాస్టింగ్‌తో ఈ సినిమా పై అంచ‌నాల‌ను రోజు రోజుకీ పెంచేస్తున్నాడు. తాజాగా ఈ చిత్రంలో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఎంట్రీ ఇచ్చేశాడు. ఇందులో గోన గ‌న్నారెడ్డి అనే కీల‌క పాత్ర‌లో బ‌న్నీ న‌టించ‌డానికి గ్నీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఈ పాత్ర కోసం మ‌హేష్ బాబు, ర‌వితేజ‌, ఎన్టీఆర్ ల పేర్లు ప‌రిశీలించారు. చివ‌రికి అల్లు అర్జున్ క‌న్‌ఫామ్ అయ్యాడు. ఈ పాత్ర గురించి గుణ‌శేఖ‌ర్ చెబుతూ ”ఈ సినిమాలో ప్ర‌తీ పాత్ర‌కూ స‌రిప‌డ న‌టీన‌టులు దొరికారు. గోన గన్నారెడ్డి పాత్ర మాత్రం అలా ఉండిపోయింది. ఆ పాత్ర‌కు ఎవ‌రైతే బాగుంటారా?? అని చాలా ర‌కాలుగా ఆలోచించా. చివ‌రికి నా క‌ల‌ల పాత్ర‌కు బ‌న్నీ న్యాయం చేయ‌గ‌ల‌డు అనిపించింది. కాక‌తీయుల చ‌రిత్ర‌లో రుద్ర‌మదేవితోపాటు స‌మానంగా చిర‌స్థాయిలో నిలిచిపోయిన పాత్ర గోన‌గ‌న్నారెడ్డిది. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా, వ‌డ్డేమాన్‌కు చెందిన ఈ వీరుడి గాథ చాలా ఆస‌క్తిక‌రం. జ‌నం కోసం రాబిన్ హుడ్ త‌ర‌హాలో రుద్ర‌మ‌దేవిపై పోరాడిన పాత్ర ఇది. ఈసినిమా చూశాక‌… రుద్ర‌మ‌దేవితో పాటు బ‌న్నీ పాత్ర కూడా వెంటాడుతుంది. ఈ పాత్ర‌కోసం బ‌న్నీ ప్ర‌త్యేక శిక్ష‌ణ తీసుకొంటున్నాడు. గుర్ర‌పుసారీ, క‌త్తియుద్ధాల‌తో ప్రావీణ్యం సంపాదిస్తున్నాడు. శిక్ష‌ణ పూర్త‌య్యాక షూటింగ్‌లో పాల్గొంటాడు. ఇది వ‌ర‌కు అత‌నికి ప‌డ్డ బ‌కాయి ఈ సినిమాతో తీర్చుకొంటున్నా ” అని గుణ‌శేఖ‌ర్ చెబుతున్నారు.