కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తుంది. ఈ క్రమంలో చిత్ర పరిశ్రమ మూతపడింది. గత కొన్ని రోజులుగా షూటింగ్స్ ఆగిపోవడం తో ఇండస్ట్రీ నే నమ్ముకున్న సినీ కార్మికుల కష్టాలు అన్నీఇన్నీ కాదు..రోజు కూలి చేస్తే కానీ డొక్కాడని పరిస్థితిలో షూటింగ్స్ బంద్ కావడం తో వారి జీవిత రోడ్డున పడింది.
ఈ నేపథ్యంలో సినీ కార్మికులను ఆదుకునేందుకు చిత్ర సీమా నడుం బిగించింది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఆర్ధిక సాయాన్ని అందజేస్తుండగా..తాజాగా మెగాస్టార్ చిరంజీవి మనకోసం అనే కార్యక్రమాన్ని చేపట్టారు. చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సి.సి.సి.) ‘మనకోసం’ను ప్రారంభించారు. ఈ చారిటి ద్వారా సినీ కార్మికులను ఆదుకునే పని చేస్తున్నారు. ఈ ఛారిటీ కోసం సినీ ప్రముఖులంతా విరాళం అందజేస్తుండగా..అల్లు అర్జున్ రూ. 25 లక్షల సాయాన్ని అందజేశారు. ఇప్పటికే మూడు రాష్ట్రాలకు కలిపి మొత్తం రూ.1.25 కోట్లను విరాళంగా ప్రకటించాడు. ఈ మొత్తంలో రూ.50 లక్షలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి, మరో రూ.50 లక్షలు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి అందిస్తున్నట్టు అల్లు అర్జున్ తెలిపాడు. అలాగే రూ.25 లక్షలు కేరళ ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు ఇవ్వడం జరిగింది.