భూమిక నెగ్గుకొస్తుందా?

Bhumikaఒక‌ప్పుడు వ‌రుస సినిమాల‌తో దూసుకుపోయింది భూమిక‌. గ్లామ‌ర్ పాత్రల‌నే న‌మ్ముకోకుండా… మిస్సమ్మ‌, అన‌సూయ లాంటి సినిమాల‌తో అభిన‌య తార అనిపించుకొంది. టాప్ స్టార్‌ల‌తో క‌ల‌సి న‌టించడం క‌ల‌సొచ్చింది. ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ఎన్టీఆర్‌, మ‌హేష్‌, వెంక‌టేష్‌, నాగార్జున అంద‌రితోనూ సినిమాలు చేసింది. అయితే ఎంత త‌క్కువ స‌మ‌యంలో ఎదిగిందో, అంతే వేగంగా… చ‌ప్పున ప‌డిపోయింది. నిర్మాత‌గానూ మారినా లాభం లేకుండా పోయింది. త‌కిట త‌కిట సినిమాతో మొత్తం పోయింది. ఆ త‌ర‌వాత తెలుగు చిత్రసీమ‌లో క‌నిపించ‌నే లేదు. ఇప్పుడు మ‌రోసారి మేక‌ప్ వేసుకొంది. ల‌డ్డూబాబు కోసం. నరేష్ ప‌క్కన అక్కలా క‌నిపిస్తుంది అనే డౌటు ఉన్నా…? ర‌విబాబు ద‌ర్శకుడు కావ‌డంతో హీరోయిన్ పాత్ర కూడా ఎలివేట్ అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ల‌డ్డూ బాబు లో భూమిక క్లిక్ అయితే, త‌న‌ని తాను నిరూపించుకోవ‌డానికి ఆమెకు ఓ అవ‌కాశం ద‌క్కిన‌ట్టే. అస‌లే క‌థానాయిక‌ల పోటీ ఎక్కువైంది. వీరంద‌రి మ‌ధ్య భూమిక నెగ్గుకొస్తుందా? అది ల‌డ్డూ బాబు సినిమానే నిర్ణయించాలి.