Site icon TeluguMirchi.com

Pottel : హార్ట్ టచింగ్ గా ‘పొట్టెల్’ నుండి ‘బుజ్జి మేక’ సాంగ్..


యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రధారులుగా సాహిత్ మోత్ఖూరి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘పొట్టేల్’. గ్రామీణ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రాన్ని నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటివరకు విడుదలైన కంటెంట్‌కు, పాటలకు విశేషమైన స్పందన రాగా.. తాజాగా ఇప్పుడు మేకర్స్ నాల్గవ సింగిల్‌ను విడుదల చేశారు.

Kalki 2898 AD : ఆ మూడు ప్రపంచాల మధ్య నడిచే కథే ‘కల్కి 2898 AD’..

‘బుజ్జి మేక బుజ్జి మేక..’ అంటూ సాగే ఈ పాట అందరి హృదయాలను హత్తుకుంటుంది. శేఖర్ చంద్ర రాసిన పాట యొక్క శక్తివంతమైన కంపోజిషన్, కాసర్ల శ్యామ్ రచించిన ఉద్వేగభరితమైన సాహిత్యం, కాల భైరవ యొక్క వ్యక్తీకరణ స్వరాలు పాటకు ప్రాణం పోసాయి. పాటలోని విజువల్స్ చాలా సహజంగా ఉన్నాయి. ఇక త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో అజయ్‌, ప్రియాంకశర్మ, తనస్వి చౌదరి, నోయల్‌సేన్‌, చత్రపతి శేఖర్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

Bujji Meka Lyrical Song | Pottel | Yuva, Ananya | Sahit Mothkhuri | Shekar Chandra | Kaala Bhairava

Exit mobile version