‘బ్రో’ టీజర్ అప్‌డేట్..


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో సముద్రఖని దర్శకత్వంలో వస్తున్న మూవీ ‘బ్రో’. త‌మిళ హిట్ ఫిల్మ్ ‘వినోదాయ సితం’ ఆధారంగా ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీతో క‌లిసి జీ స్టూడియోస్ వారు నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీలో కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, బ్రహ్మానందం, రాజా చెంబోలు, తనికెళ్ళ భరణి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టీజ‌ర్‌ని త్వరలోనే రిలీజ్ చేయ‌బోతున్నార‌ని తెలుస్తోంది. ఈ సంద‌ర్భంగా టీజర్ అప్డేట్ అంటూ మేక‌ర్స్ విడుద‌ల చేసిన కొత్త పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటోంది. మామా అల్లుళ్లు ప‌వ‌న్ క‌ల్యాణ్‌, సాయి ధ‌ర‌మ్ తేజ్ లుంగీలు ధ‌రించి పక్కా మాస్ లుక్‌లో క‌నిపిస్తున్న తీరు అదిరిపోయింది. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఈ టీజర్ కి డబ్బింగ్ చెపుతున్నారట. ఇకపోతే ఈసినిమా జూలై 28న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.