Site icon
TeluguMirchi.com

ఆకట్టుకుంటున్న ‘బ్రో’ సెకండ్ సింగిల్ ‘జాణవులే.. నెరజాణవులే..’


ప‌వ‌న్ క‌ళ్యాణ్, సాయి ధ‌ర‌మ్ తేజ్‌ కాంబోలో వ‌స్తున్న చిత్రం బ్రో. ఈ సినిమా తమిళంలో ఘ‌న విజ‌యం సాధించిన‌ వినోద‌య సితం సినిమాకి రీమేక్‌గా తెర‌కెక్కుతోంది. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా జూలై 28న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ లో జోరు పెంచిన చిత్రయూనిట్ తాజాగా ఈ సినిమా నుండి సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేశారు.

‘జాణవులే.. నెరజాణవులే..’ అంటూ సాగే ఈ పాటను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది. సాయిధరమ్ తేజ్, కేతిక శర్మ ల మధ్య సాగే ఈ రొమాంటిక్ సాంగ్ ను స్వయంగా థమన్‌ ఆలపించడం విశేషం. పైగా చాలా రోజుల తర్వాత తన వోకల్స్ లో సాంగ్ పాడడం చాలా బాగుంది. ఫిమేల్ లిరిక్స్ కె. ప్రణతి పడగా, కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించాడు. ఇకపోతే మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్న ఈసినిమాలో కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది.

Jaanavule Lyrical Video | BRO Telugu Movie | Pawan Kalyan | Sai Dharam Tej | Ketika Sharma | Thaman

Exit mobile version