Site icon TeluguMirchi.com

’బాహుబలి’ ఆగిపోయింది… !!

bahubaliiటైటిల్ చూసి కంగారు పడకండీ. బాహుబలి ఆగిపోయింది అంటే.. పూర్తిగా కాదు. షూటింగ్ కు కాస్త విరామం ఇచ్చారంతే. గత కొద్దిరోజులుగా హైదరబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో బారీ యాక్షన్ సీన్స్ ని చిత్రీకరిస్తున్న విషయం తెలిసిందే. చాలా రోజుల పాటు విరామం లేకుందా చిత్రీకరణ జరిపారు దర్శకుడు జక్కన్న. వేలాది మంది ఫైటర్లు, జూ. ఆర్టిస్టులు చిత్రీకరణలో పాల్గొన్నారు. దీంతో.. షూటింగ్ కు కొన్ని రోజుల విరామం ఇచ్చాడు దర్శకుడు రాజమౌళి. ప్రభాస్, రానాలతో పాటుగా.. ఇతర బృందం కాస్త రిలాక్స్ అవడానికి వీలుంటుందని జక్కన్న ఈ విరామాన్ని ఇచ్చాడట. అన్నట్టు.. ’బాహుబలి’ వచ్చే యేడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version