బన్నీ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ చిత్రం దిశగా రేసుగుర్రం దూసుకుపోతోంది. తొలి మూడు రోజుల్లో రూ.20 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డ్ సృష్టించింది. దాంతో చిత్రబృందం ఫుల్ ఖుషీలో ఉంది. సురేందర్‌రెడ్డి టేకింగ్, బన్నీ యాక్టింగు, తమన్ మ్యూజిక్కూ… మేజిక్కు చేసినా.. చివర్లో క్రెడిట్ అంతా కొట్టేసింది కిల్ బిల్ పాండే బ్రహ్మానందమే. సినిమా అంతా ఒకెత్తు, చివర్లో కిల్ బిల్ పాండే దూకుడు మరో ఎత్తు.. అని సినిమా చూసినవాళ్లంతా చెబుతున్నారు. చివర్లో బ్రహ్మానందం దూకుడు లేకపోతే ఈ సినిమా సాదా సీదా సినిమాగా నిలిచేదని చెబుతున్నారు. ఈ మాటల్లో అతిశయోక్తి ఏమీ లేదు. రేసుగుర్రంలోనిదీ రొటీన్ క్లైమాక్సే. కానీ.. బ్రహ్మానందం యాడ్ అయి దాని రేంజ్ పెంచేశాడు. బ్రహ్మీ సీరియస్‌గా చెప్పిన డైలాగులు… థియేటర్లో డైనమైట్లలా పేలుతున్నాయి. దాంతో క్లైమాక్స్‌లో బన్నీ.. సైడ్ అయిపోయిన ఫీలింగ్. ఈ సినిమాని రెండో హీరోలా క్లైమాక్స్‌లో మోసేశాడు బ్రహ్మీ. దాంతో సినిమా చూసొచ్చిన తరవాత.. బన్నీ కొంటే బ్రహ్మీ గురించే ఎక్కువగా మాట్లాడుకొంటున్నారు. దటీజ్ బ్రహ్మీ!!