బ్రమ్మిని పక్కన పెట్టిన టాప్ డైరెక్టర్

Srinu-Bhrmaబ్రహ్మానందం హాస్యానికి మారుపేరు. ఈ పేరు వింటే చాలు మనోలోని బాధలన్ని కూడా పోతాయి. అంతలా తెర ఫై కామెడీ పండిస్తాడు. బ్రహ్మానందం ఉంటె సినిమా సూపర్ హిట్ అవుతుందని నమ్ముతారు పెద్ద డైరెక్టర్స్. ముఖ్యంగా దర్శకుడు శ్రీను వైట్లకు బ్రహ్మానందంకు మధ్య ఉన్న అనుబంధం అంతా ఇంతాకాదు. శ్రీనువైట్ల తన చిత్రాలలో బ్రహ్మానందాన్ని మ్యాగ్జిమమ్‌ వాడుకుంటాడు. ఇటీవల విడుదలైన ఆగడు చిత్రంలో కూడా బ్రమ్మి క్యారెక్టరే హైలెట్‌గా నిలిచింది. మరి అలాంటి బ్రమ్మి ని ఇప్పుడు శ్రీనువైట్ల పక్కన పెట్టడని ప్రచారం జరుగుతుంది. ఆగడు పరాజయంతో పూర్తిగా తన మైండ్ సెట్ మార్చుకున్న వైట్ల బ్రహ్మానందంని కూడా మార్చాలని డిసైడ్ అయ్యాడట.

బ్రహ్మానందం ప్లేస్‌లో తమిళ కమిడయన్‌ సంతానంకు అవకాశం ఇస్తునంట్లు సమాచారం. ప్రస్తుతం రామ్‌ చరణ్‌, శ్రీనువైట్ల కాంబినేషన్‌లో ఓ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే . ఈ చిత్రం ఈనెల 27న ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో సంతానంకు ఓ డిఫెరెంట్‌ పాత్రను క్రియేట్‌ చేసాడట శ్రీనువైట్ల.