Site icon TeluguMirchi.com

బ్రహ్మీ ఇక్కడ తక్కువ కానీ అక్కడ ఎక్కువే..

Brahmanandam-kannada-offers దాదాపు మూడు దశాబ్దాలుగా బ్రహ్మానందం తన కామెడీ తో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. ఈ మధ్య తెలుగు లో తన హావ కాస్త తగ్గింది. కొత్త కామెడియన్స్ ఎంట్రీ తో కాస్త బ్రహ్మీ పక్కకు పెట్టారు మన దర్శక , నిర్మాతలు. కానీ పక్క భాషలలో మాత్రం బ్రహ్మీ హావ రోజు రోజుకి పెరిగిపోతుంది.

ఇప్పటికే కమల్ హాసన్ దర్శకత్వం వహిస్తున్న ‘శభాష్ నాయుడు’ ఓ కీలక పాత్రలో నటిస్తున్న బ్రహ్మీ కి తాజాగా మరో మెగా ఆఫర్ దక్కింది. కన్నడలో తెరకెక్కుతున్న ఓ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు అయిన నిఖిల్ గౌడ హీరోగా 50 కోట్ల భారీ బడ్జెట్ తో ‘జాగ్వార్’ అనే సినిమా లో నటించే అవకాశం దక్కింది. తెలుగు లో బాలకృష్ణ తో ‘మిత్రుడు’ అనే సినిమా తీసిన మహదేవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

Exit mobile version