సినిపరిశ్రమను నమ్ముకొని దయనీయ పరిస్థితుల్లో ఉన్న పేద కళాకారులను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అక్కున చేర్చుకుంటుంది. వారికి నెలకు అసోసియేషన్ తరుపున కొంత డబ్బును సహాయంగా అందచేయడం జరుగుతుంది..తాజాగా ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం గారు ఒక సంవత్సర కాలం పాటు పది మంది పేద కళాకారులకు నెలకు 1500 రూపాయలు చొప్పున ఆయన సహాయం చేయడానికి ముందుకొచ్చారు. బ్రహ్మానందం తీసుకున్నఈ నిర్ణయం ఫై అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు..అలాగే ఇండస్ట్రీ లోని అగ్ర హీరోలు , మరి కొంత మంది నటి నటులు ముందుకు వచ్చి పేద కళాకారులను అధుకోవాలని తెలుగుమిర్చి కోరుకుంటుంది…