పేద కళాకారులను ‘బ్రహ్మానందం’ చేయూత..

Bharmaదాదాపు 900 కి పైగా సినిమాలలోనటించి, ప్రపంచములోనే అరుదయిన గిన్నీస్ రికార్డు సైతం సొంతం చేసుకున్న హాస్య బ్రహ్మ ‘బ్రహ్మానందం’. టాలీవుడ్ అగ్ర హీరోలకు తను ఏమాత్రం తీసిపోను అనేరీతిగా పారితోషకం తీసుకుంటూ , బ్రహ్మానందం లేని సినిమా చూడలేం అనేంతగా అబిమనులును సొంతం చేసుకున్నాడు..తాజాగా ఈ హాస్య నటుడు ఓ గొప్ప నిర్ణయం తీసుకొని అందరికి ఆదర్శంగా నిలిచాడు..ఇంతకి ఆ నిర్ణయం ఏంటో మీరే చదవండి…

సినిపరిశ్రమను నమ్ముకొని దయనీయ పరిస్థితుల్లో ఉన్న పేద కళాకారులను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అక్కున చేర్చుకుంటుంది. వారికి నెలకు అసోసియేషన్ తరుపున కొంత డబ్బును సహాయంగా అందచేయడం జరుగుతుంది..తాజాగా ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం గారు ఒక సంవత్సర కాలం పాటు పది మంది పేద కళాకారులకు నెలకు 1500 రూపాయలు చొప్పున ఆయన సహాయం చేయడానికి ముందుకొచ్చారు. బ్రహ్మానందం తీసుకున్నఈ నిర్ణయం ఫై అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు..అలాగే ఇండస్ట్రీ లోని అగ్ర హీరోలు , మరి కొంత మంది నటి నటులు ముందుకు వచ్చి పేద కళాకారులను అధుకోవాలని తెలుగుమిర్చి కోరుకుంటుంది…