సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తున్న ‘ధనవంతుడు ‘

Dhanavanthuduటెక్నాలజీ పుణ్యమని ఈ మద్య ఏ పెద్ద హీరో సినిమా వచ్చిన కానీ దానిపై రకరకాల పేరడీ పోస్టర్స్, స్పోఫ్ వీడియోలు పుట్టుకొచ్చేస్తున్నాయి. ఆ హీరో స్థానంలో కామెడీ నటుల ఫొటోస్ పెట్టడం లేదా వీడియోస్ రెడీ చేసి అప్లోడ్ చేయడం బాగా చేస్తున్నారు. అలాంటి పేరడీ పోస్టర్స్ కు ముందు ఉండే కమెడియన్ బ్రహ్మానందం. బ్రహ్మానందం ఫోటో ఏ పోస్టర్ కైన , హీరోకైన సెట్ అవుతుంది. అందుకే పెద్ద సినిమాల హీరో పోస్టర్స్ కు బ్రహ్మానందంన్ని బాగా వాడతారు. ఈ మద్య సంపూని కూడా బాగానే వాడుతున్నారు.

తాజాగా రిలీజ్ అయిన బాహుబలి చిత్రానికి సంబంధించి ఎన్నోరకాల ఫన్నీ ఫోటోలు సోషల్ నెట్ వర్క్ లో హల్ చల్ చేసాయి. ఇక యూట్యూబ్ లో పెరడీలకు కొదవే లేకుండా పోయాయి ఇవి నిజమే అన్నట్లు వాటిని క్రియిట్ చేసారు.. తాజాగా మహేష్ బాబు నటించిన ‘శ్రీమంతుడు’ చిత్రానికి బ్రహ్మానందం న్ని ‘ధనవంతుడు ‘చేసారు..ఇప్పుడు ఈ పిక్స్ ఇంటర్ నెట్ లో బాగా చూస్తున్నారు..ఆ పోస్టర్ షేర్ చేస్తూ వాటికీ కామెంట్స్ ఇస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా ఈ ధనవంతుడు ని చూసి లైక్ కొట్టండి…