విభిన్న పాత్రలను పోషిస్తూ తనకంటూ అభిమానులను సొంతం చేసుకున్న నటుడు బ్రహ్మజీ. సింధూరంతో హీరోగా పరిచయమైన బ్రహ్మాజీ ..ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సపోర్టింగ్ రోల్స్ లలో పదుల సంఖ్య సినిమాల్లో నటించి ఆకట్టుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సీనియర్ నటుల్లో ఈయన ఒకరు. తాజాగా ఈయన చిరంజీవి నటించిన సైరా చిత్రంలో ఒడ్డె ఓబన్న పాత్రలో నటించాడు.
అక్టోబర్ 02 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని..బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఇక ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరి నటన ఫై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్రహ్మాజీ తన ట్విట్టర్ ద్వారా తన పాత్ర గురించి చెప్పుకొచ్చాడు. చిన్న పాత్ర అడిగితె సినిమాలో చాలా ఇంపార్టెన్స్ ఉన్న పాత్రను ఇచ్చారని.. మెగాస్టార్ కు, నిర్మాత చరణ్ కు అలానే దర్శకుడు సురేందర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఇందులో గుండుతో కనిపిస్తాడు బ్రహ్మాజీ. సెట్స్ లో బ్రహ్మాజీకి రామ్ చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డిలు కటింగ్ చేస్తున్న ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేసి కృతజ్ఞతలు తెలిపారు బ్రహ్మాజీ.
Requested Ram Charan garu to give me an opportunity to work with mega star in #SyeRaa .. never imagined it to be a full length role.. ever greatful ????.. Nd can’t thank enough @DirSurender @RathnaveluDop for ur support ??.@KonidelaPro ?? pic.twitter.com/jKqRYCZdj3
— BRAHMAJI (@actorbrahmaji) 4 October 2019