Site icon
TeluguMirchi.com

క్రేజీ గా ‘బాయ్స్ హాస్టల్’ ట్రైలర్ !


టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యుషన్ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కలిసి కన్నడ బ్లాక్ బస్టర్ ‘హాస్టల్ హుడుగారు బేకగిద్దరే’ను తెలుగులో ‘బాయ్స్ హాస్టల్’ పేరుతో విడుదల చేస్తున్నారు. నితిన్ కృష్ణమూర్తి ఈ చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేసారు. ఇందులో ప్రజ్వల్ బిపి, మంజునాథ్ నాయక, రాకేష్ రాజ్‌కుమార్, శ్రీవత్స, తేజస్ జయన్న ఉర్స్ ప్రధాన పాత్రలు పోషించగా.. రిషబ్ శెట్టి, పవన్ కుమార్, షైన్ శెట్టి, రష్మీ గౌతమ్, తరుణ్ భాస్కర్ అతిధి పాత్రల్లో నటించారు. ఇకపోతే తాజాగా ‘బేబీ’ టీమ్ బాయ్స్ హాస్టల్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసింది.

ఇక ట్రైలర్ లో బాయ్స్ హాస్టల్ లో అబ్బాయిలు ఏ విధంగా తమ లైఫ్ ని లీడ్ చేస్తుంటారు అనేది చూపించారు. ఇక వారు జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ, అల్లరిగా సరదాగా గడుపుతున్న తరుణంలో హాస్టల్ వార్డెన్ అనుమానాస్పద పరిస్థితులలో చనిపోతాడు. అయితే హాస్టల్‌ కుర్రాళ్లు దీన్ని యాక్సిడెంట్‌గా మార్చే ప్రయత్నం చేస్తారు. మొత్తానికి ట్రైలర్ ఫన్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ అంశాలతో ఆకట్టుకుంటుంది. ఇకపోతే నటీనటులందరూ కొత్తవారే అయినప్పటికీ తమ రియలిస్టిక్ యాక్టింగ్‌తో కథనంలో ఫ్రెష్‌నెస్ తీసుకొచ్చారు. కాగా ఈ సినిమా ఆగస్ట్ 26న విడుదల కానుంది.

Boys Hostel Theatrical Trailer | In Cinemas Aug 26 | Annapurna Studios | Nithin Krishnamurthy

Exit mobile version