#BoyapatiRAPO టైటిల్ అనౌన్స్‌మెంట్‍ డేట్ ఫిక్స్..


బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా #BoyapatiRAPO అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్నా సంగతి తెలిసిందే. ఇక సాలిడ్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. కాగా ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తుంది. ఇకపోతే ఇప్పటికే సెప్టెంబర్ 15వ తేదీన ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. కాగా ఈ సినిమా టైటిల్‍‍ ఎలా ఉంటుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు తాజాగా దీనికి సంబంధించిన అప్డేట్ ను ప్రకటించారు మేకర్స్.

“మాస్ మ్యాడ్‍నెస్‍ను తీసుకొస్తున్నాం. మాసివ్ ఎనర్జిటిక్ బోయపాటిరాపో టైటిల్ గ్లింప్స్‌ను జూలై 3వ తేదీ ఉదయం 11 గంటల 25 నిమిషాలకు తీసుకొస్తున్నాం” అంటూ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇకపోతే పక్కా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.