Site icon TeluguMirchi.com

పవర్ ఫుల్ గా రామ్, బోయపాటి మూవీ టైటిల్..


బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా #BoyapatiRAPO అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న సంగతి తెలిసిందే. సాలిడ్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఇకపోతే ఈరోజు గురుపూర్ణిమ సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్ ను ప్రకటించారు మేక‌ర్స్. ‘స్కంద’ అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఈ సినిమాకి ఫిక్స్ చేశారు.’ది అటాక‌ర్‌’ అనేది ఉప‌శిర్షిక‌. స్కంద అంటే కుమారస్వామి అని అర్ధం వస్తుంది. అంతే కాదు టైటిల్‌తో పాటు గ్లింప్స్‌ని కూడా విడుద‌ల చేశారు.

Skanda Title Glimpse - Telugu | Ram Pothineni | Sreeleela | Boyapati Sreenu | Thaman S

ఈ గ్లింప్స్‌ లో ఫుల్ యాక్షన్ మోడ్ లో కనిపిస్తున్న రామ్ విజువల్స్ ఆసక్తికరంగా వున్నాయి. అంతేకాదు ‘మీరు దిగితే ఊడేదుండ‌దూ.. నేను దిగితే మిగిలేదుండదు..’ అనే డైలాగ్ తో రామ్ పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో అర్ధమవుతుంది. ఇక తమన్ అందించిన మ్యూజిక్ అద్భుతంగా వుంది. ఇకపోతే పక్కా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. కాగా ఈ మూవీని సెప్టెంబ‌ర్ 15న తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.

Exit mobile version