Site icon TeluguMirchi.com

బోయపాటి హీరో బన్నీనే.. !

టాలీవుడ్ టాప్ దర్శకుల్లో బోయపాటి శ్రీను ఒకరు. ఆయనతో సినిమా చేసేందుకు స్టార్ హీరోలు ఆసక్తి చూపేవారు. ఐతే, ‘వినయ విధేయ రామ’ అట్టర్ ప్లాప్ తర్వాత పరిస్థితి మారింది. బోయపాటి వైపు ఎవరు కూడా చూడాలేదు. ఆఖరిని బాలయ్య కూడా బోయపాటికి హ్యాండిచ్చాడు. బాలయ్య ఓకే చెప్పిన నిర్మాత దొరికే పరిస్థితి లేదు. ఇలాంటి టైంలో బోయపాటికి అపద్భాందవుడు అయ్యాడు అల్లు అరవింద్. ‘గుణ369’ టీజర్ విడుదల కార్యక్రమానికి హాజరైన అరవింద్ త్వరలోనే బోయపాటితో సినిమా ఉంటుందని ప్రకటించారు.

ఈ నేపథ్యంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ తెరకెక్కనున్న బోయపాటి సినిమాలో హీరో ఎవరనే చర్చ సాగుతోంది. ఐతే, అల్లు అరవింద్ హీరోగానే బోయపాటి సినిమా ఉండబోతుందని సమాచారమ్. బోయపాటి-బన్నీ కలయికలో వచ్చిన సరైనోడు బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మరోసారి బన్నీతో మాస్-యాక్షన్ ఎంటర్ టైనర్ చేయబోతున్నాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్రివిక్రమ్ – బన్నీ సినిమా పూర్తవ్వగానే బోయపాటి సినిమా పట్టాలెక్కనుంది.

Exit mobile version