Site icon TeluguMirchi.com

బ‌న్నీతో బోయ‌పాటి?

bunnay
లెజెండ్‌తో సూప‌ర్ డూప‌ర్ హిట్ ఇచ్చి మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చేశాడు… బోయ‌పాటి శ్రీ‌ను. అయితే త‌న త‌రువాతి సినిమాపై ఇంకా సందిగ్థ‌త నెల‌కొనే ఉంది. రామ్‌చ‌ర‌ణ్‌కి క‌థ చెప్పాడు. అయితే చెర్రీ నుంచి ఎలాంటి స్పంద‌నా రావ‌డం లేదు. అందుకే…. ఇప్పుడు మ‌రో మెగా హీరోకి క‌థ చెప్పి గ్రీన్ సిగ్న‌ల్ అందుకోవాల‌న్న ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు. ఇటీవ‌లే అల్లు అర్జున్ – బోయ‌పాటి ల మ‌ధ్య భేటీ జ‌రిగింది. అప్పుడే బ‌న్నీకి బోయ‌పాటి ఓ లైన్ చెప్పాడ‌ని, క‌థ బ‌న్నీకి విప‌రీతంగా న‌చ్చింది…. ఈ ప్రాజెక్ట్ ఫైల‌లైజ్ అవ్వ‌డమే త‌రువాయి అని టాక్‌. చ‌రణ్‌ని ప‌క్క‌న పెట్టి బోయ‌పాటి బ‌న్నీతో సినిమా చేస్తున్నాడా?? లేదంటే చ‌ర‌ణ్‌తో సినిమా అయ్యాక‌… అప్పుడు బ‌న్నీతో సినిమా మొద‌లెడ‌తాడా?? అన్న‌ది తెలియాల్సివుంది. యూత్‌, మాస్ క‌థ‌లు చేస్తున్న బ‌న్నీ.. ఇప్పుడు 100% యాక్ష‌న్ క‌థ‌లోకి దూరిపోతున్నాడ‌న్న‌మాట‌. బోయ‌పాటి సినిమా అంటే.. ఫుల్ లెంగ్త్ యాక్ష‌నే క‌దా..??

Exit mobile version