యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే బోయపాటి శ్రీను పుట్టిన రోజు వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. ప్రస్తుతం బోయపాటి , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఓ యాక్షన్ మూవీ ని తెరకెక్కిస్తున్నారు. నిన్న బోయపాటి పుట్టిన రోజు కావడం తో ఆ వేడుకలను చిత్ర సెట్స్ లోనే చరణ్ నిర్వహించారు. కేక్ కట్ చేసి బోయపాటి కి బర్త్ డే విషెష్ ను తెలిపారు. చరణ్ తో పాటు మిగతా యూనిట్ సభ్యులు కూడా బర్త్‌డే విషెస్ అందించారు.
చరణ్‌తో తొలిసారి బోయపాటి సినిమా చేస్తుండగా, ఈ చిత్రం పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్గా ఉంటుందని యూనిట్ అంటున్నారు. ఈ సినిమా కోసం చెర్రీ తన మేకోవర్ని పూర్తిగా మార్చుకున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ జరుపుకుంటుంది. భరత్ అనే నేను చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన కైరా అద్వానీ ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది.
వివేక ఒబెరాయ్, ప్రశాంత్, స్నేహ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. డీవివి ఎంటర్టైన్మెంట్ బేనర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ సంగీతం అందిస్తున్నాడు. దసరా కు ఈ మూవీ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.