నందమూరి బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదలవ్వకుండా స్టోరీ లైన్ కూడా లీకైంది. బాలకృష్ణ రెండు విభిన్నమైన గెటప్పుల్లో కనిపిస్తారని, అందులో అఘోరా గెటప్ ఒకటని ప్రచారం జరిగింది.
బాలకృష్ణ అఘోర పాత్రకి డైలాగ్స్ తక్కువగా వుంటాయనే టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ పాత్ర విషయంలో బాలకృష్ణ అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారట. బోయపాటి సన్నిహితులు కూడా, అఘోర పాత్రను ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకంటారోననే సందేహాన్ని వ్యక్తం చేశారట. దాంతో బోయపాటి ఆ పాత్ర నిడివిని తగ్గించి, అఘోరగా బాలకృష్ణ తెరపై తక్కువ సేపు కనిపించేలా స్క్రిప్టులో మార్పులు చేసుకుంటున్నాడని టాక్.