విషయం తెలిసిన పోలీసులు నేడు ఉదయం ఫిల్మ్ ఛాంబర్‌కు వెళ్లి ఆమెను బలవంతంగా బయటకు తీసి కేసు నమోదు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ నేను పవన్‌పై ఉన్న అభిమానంతో జనసేన పార్టీకి చాలా చేశాను. కాని ఆయన మాత్రం నన్ను వాడుకుని వదిలేశాడు. కనీసం నన్ను ఆదుకుని సాయం చేస్తాడనుకుంటే నన్ను కలిసేందుకు కూడా ఆయన ఇష్టపడటం లేదు అంటూ సునీత ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన చేసిన పనితో తాను చాలా ఇబ్బంది పడుతున్నాను అని ఇప్పటికైనా నన్ను ఆదుకోవాలంటూ పవన్‌ను ఉద్దేశించి ఆమె డిమాండ్ చేసింది. అయితే జనసేన నాయకులు మాత్రం ఆమెది కేవలం పబ్లిసిటీ స్టంట్ అంటూ కొట్టి పారేస్తున్నారు.