Site icon TeluguMirchi.com

రీమేక్ తో వ‌స్తున్న బొమ్మ‌రిల్లు భాస్క‌ర్‌

bommarillu-bhaskar

బొమ్మ‌రిల్లు… ఈ ఒక్క సినిమాతో ఎంతో ఎత్తుకు ఎదిగిపోయాడు భాస్క‌ర్‌. ఆ సినిమాతో బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ అయిపోయాడు. ఆ ఎత్తుల కింద‌కు ప‌డిపోవ‌డానికి ఎంతో స‌మ‌యం ప‌ట్ట‌లేదు. ఆరెంజ్‌, ఒంగోలు గిత్త సినిమాల‌తో…. నిర్మాత‌లు భాస్క‌ర్ పేరు త‌ల‌చుకోవ‌డానికే ఝ‌డుసుకొన్నారు. అందుకే ఇంత విరామం వ‌చ్చింది. ఇప్పుడాయన ఓ రీమేక్ సినిమాతో మ‌ళ్లీ త‌న ప్ర‌తిభ‌ను నిరూపించుకొందామ‌నుకొంటున్నారు. ఆ సినిమానే .. మ‌ల‌యాళ సూప‌ర్ హిట్… బెంగ‌ళూర్ డేస్‌. అంజలి మీనన్ దర్శకత్వం వహించాడు. ఇటివలే విడుదలై ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలతో పాటు కలెక్షన్స్ కూడా అదిరిపోయాయి. ఇప్పుడీ చిత్ర రిమేక్ హక్కులను పీవీపీ సంస్థ దక్కించుకొంది. ఈ చిత్రానికి బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ని సమాచార‌మ్‌. మ‌రి పోయిన ప్ర‌తిష్ట‌ను భాస్క‌ర్ తిరిగి ద‌క్కించుకొంటాడో లేదో చూడాలి.

Exit mobile version