ఆ తర్వాత ‘క్వీన్’ చిత్రంలో నటించాక తనకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని, ఎవరితోనో నటించాలని తాను ఆశ పడడం లేదని వ్యాఖ్యానించింది. ఆ తర్వాత ‘తాను వెడ్స్ మను’ చిత్రంతో నా ఆలోచనలు మొత్తం మారాయి అని, కథలను ఎంపిక చేసుకునే విషయంలో చాలా మెచ్యురిటీ వచ్చిందని కంగనా చెప్పుకొచ్చింది.
ఖాన్ల గురించి మాట్లాడుతూ… ఖాన్‌లతో నటిస్తే ఫలితం శూన్యమే అని, మనం ఖాన్‌లతో చేసే రొమాన్స్‌కు మంచి మార్కులు పడ్డా కూడా అదీ వారికే దక్కుతుంది కాని, మన నటనకు ఏం ఫలితం ఉండదు అని, ఖాన్‌లతో నటించకపోవడమే మంచిది అని ఈ అమ్మడు సంచలన వ్యాఖ్యలు చేసింది. మొదట ఇంత ధీమాగా మాట్లాడిన కంగనా వ్యాఖ్యలు చూసి అంత నివ్వెరపోయారు.
చివరకు ఖాన్ల అవకాశాలు వచ్చినా కూడా నటిస్తాను, ఎలా మిస్ చేసుకోవాలి అని చెప్పి షాకిచ్చింది. ఇటీవలె దర్శక నిర్మాతలు, స్టార్ హీరోలపై ఘాటు వ్యాఖ్యలు చేసిన కంగనా తాజాగా ఖాన్‌పై ఘాటుగా స్పందించింది. ఎప్పుడు ఏదో సంచలనం చేసే కంగనా ఈసారి బాలీవుడ్ ఖాన్ల గాలి తీసేసింది.