బాలీవుడ్ హాట్ బ్యూటి ఆలియాభట్ సిద్ధార్థ్ మల్హోత్రాతో పని ఉండడంతో అర్థరాత్రి వరకు అక్కడే ఉండాల్సి వచ్చిందట. ఆ తర్వాత తన ఫ్లాట్‌కు బయల్దేరుదామని తన బాడీగార్డ్‌కు ఫోన్ చేయగా అతడు పీకల దాకా తాగి తూలుతూ వచ్చాడట. అంతేకాకుండా బాగా తాగిన మత్తులో అతడు వెనుక సీట్లో ఆలియా పక్కనే కూర్చున్నాడట. తన పక్కన కూర్చున బాడీగార్డ్ వద్ద తట్టుకోలేనంతగా మద్యం వాసన వచ్చిందట. అంతేకాకుండా తాగిన మత్తులో పక్కనే కూర్చొని ఏవేవో మాట్లాడుతున్నాడట. తనకు ఇంత ఇబ్బంది కలిగినా కూడా గట్టిగా అరిస్తే అతడు రెచ్చిపోయి ఇంకా ఎమైనా చేయొచ్చు అనే ఉద్దేశ్యంతో ఊపిరి బిగపట్టుకుని అలాగే కూర్చుందట.
పీకల దాకా తాగిన బాడీగార్డ్ పక్కన కూర్చున్న ఆలియా ఆ సమయంలో ఒక్కమాట కూడా అనలేదట. అంతేకాకుండా ఫ్లాట్‌కు చేరేదాకా తన ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుందట. ఫ్లాట్‌కు చేరిన అనంతరం ఈ విషయాన్ని తన తల్లి సోని రజ్దాన్‌తో చెప్పగా ఆమె వెంటనే ఆ బాడీ గార్డ్‌ను పీకేసి వేరే అతడ్ని నియమించింది. ఇటీవలె మళయాల హీరోయిన్ భావనపై కూడా ఇలాగే కారు డ్రైవర్ మరియు సన్నిహితులే లైంగిక వేధిపులకు పాల్పడ్డారు. హీరోయిన్లకు సొంతం మనుషుల దగ్గర కూడా భద్ర లేకుండా పోయింది. మొత్తానికి ఆలియాకు బాడీగార్డ్ నుండి పెద్ద ప్రమాదమే తప్పింది అని చెప్పవచ్చు.